Annamayya Keerthana || చూడరమ్మ సతులారా - cUDaramma satulArA
ప||
చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ |
కూడున్నది పతి చూడికుడుత నాంచారి ||
చ||
శ్రీమహాలక్ష్మియట సింగారాలకేమరుదు |
కాముని తల్లియట చక్కదనాలకేమరుదు |
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు |
కోమలాంగి ఈ చూడికుడుత నాంచారి ||
చ||
కలశాబ్ధి కూతురట గంభీరాలకేమరుదు |
తలపలోక మాతయట దయ మరియేమరుదు |
జలజనివాసినియట చల్లదనమేమరుదు |
కొలదిమీర ఈ చూడికుడుత నాంచారి ||
చ||
అమరవందితయట అట్టే మహిమయేమరుదు |
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు |
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె |
కొమెర వయస్సు ఈ చూడికుడుత నాంచారి ||
Comments
Post a Comment